Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత…
ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…