డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈనెల 18న సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొననున్నారు రాజ్నాథ్ సింగ్. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రానున్నారు. మెదక్, సికింద్రాబాద్…
అతి త్వరలో జరగబోయే లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం పెరిగిపోయింది. ఎన్నికల నేపథ్యంలో భాగంగా తాజాగా కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి అనుచరులు, ఇంటి సభ్యులతో కలిసి పెద్ద కోలాహలంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటె.. మరోవైపు తాజాగా మహారాష్ట్రలో ఓ విచిత్రమైన నామినేషన్ దాఖలు అయింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన…
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) వెళ్లడం ఖాయమైంది. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. వయసురీత్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు
ఎల్బీనగర్ కాషాయమయంగా మారింది. భారీ జన సంద్రంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు హయత్ నగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ శ్రేణులు, మిత్ర పక్షం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.
కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు.