సెప్టెంబర్ 9-13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌కు వేదికగా గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియాన్ని అఫ్గాన్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభ సమయానికి మైదానం చిత్తడిగా ఉండటంతో.. టాస్ పడకుండానే తొలి రెండు రోజులు ఆట రద్దయింది. ప్రస్తుతం నోయిడాలో వర్షాలు లేకున్నా.. గత వారం కురిసిన వానల కారణంగా స్టేడియంలో ఔట్…