హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ ఎకనామిక్స్ బహుమతి లభించింది. ప్రపంచ మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై అవగాహనను ఇనుమడింపజేసేలా పలు సిద్ధాంతాలకు క్లాడియో గోల్డిన్ రూపకల్పన చేశారు.
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ప్రైప్ ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జోన్ ఫోస్సేకు 2023కి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. దాదాపుగా 40 ఏళ్లుగా జోన్ ఫోస్సే నవలలు, నాటకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. అతను రచించిన రచనలు యాభైకి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. నాటకాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యిసార్లు ప్రదర్శించబడ్డాయి
2023:మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. "క్వాంటం డాట్‌ల ఆవిష్కరణ, సంశ్లేషణ" కోసం రసాయన శాస్త్రంలో మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్ , అలెక్సీ ఎకిమోవ్‌లకు నోబెల్ బహుమతి లభించింది.
2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్ విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పియరీ అగోస్టినీ, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్'హుల్లియర్‌లకు అందించాలని నిర్ణయించింది.