గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడింది. మరమ్మతులు లేక.. రాను రాను బ్యారేజీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆధునీకరణకు నోచుకోక, మరమ్మతులకు గురై డేంజర్ పరిస్థితిలో పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యారేజీ మనుగడ పెంచుతుందా ? కాసులిచ్చి కాపాడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యం, రోజు రోజుకు తగ్గిపోతుంది. కాటన్ బ్యారేజీ పునర్నిర్మాణం జరిగి అయిదు దశాబ్దాలు దాటుతున్నా..…