కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడింది. మరమ్మతులు లేక.. రాను రాను బ్యారేజీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆధునీకరణకు నోచుకోక, మరమ్మతులకు గురై డేంజర్ పరిస్థితిలో పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యారేజీ మనుగడ పెంచుతుందా ? కాసులిచ్చి కాపాడుతుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యం, రోజు రోజుకు తగ్గిపోతుంది. కాటన్ బ్యారేజీ పునర్నిర్మాణం జరిగి అయిదు దశాబ్దాలు దాటుతున్నా.. ఆధునికీకరణకు నోచుకోలేదు. కాటన్ కలలరూపం.. పదికాలాలు సేవలందించాలంటే, బ్యారేజీలో నీటి విడుదల వేళ ఎదురవుతున్న సాంకేతిక లోపాలు అధిగమించాలి. ఉగ్ర గోదావరికి అడ్డుకట్ట వేసే గేట్ల సామర్థ్యం మరింత పెంచాలి. నిర్వహణ సమర్థంగా సాగేలా చొరవ చూపాలి. ఈ పనులు అన్ని చేపట్టాలంటే.. ముందు మరమ్మతులకు ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాల్సి ఉంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తూర్పు- పశ్చిమ- మధ్య డెల్టాల పరిధిలో 10 లక్షల 16 వేల ఎకరాలకు కాటన్ బ్యారేజీ ద్వారా సాగునీరు అందుతోంది. జిల్లాలో ఖరీఫ్- 2021లో 136 టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందిస్తే.. సముద్రంలోకి 2 వేల 463 టీఎంసీలు వదిలేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల 21 వేల ఆయకట్టు ఉంటే.. ఈ రబీలో ఈ జలాలే కీలకంగా మారాయి. ఇక బ్యారేజీపై ప్రయాణం అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు కిలోమీటర్లు పొడవు ఉన్న రోడ్డు అధ్వాన్న స్థితి చేరింది. బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి మనుగడ పెంచాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు.
డ్రిప్-2 కింద 2019లో 61 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపారు. ఈ నిధులతో బ్యారేజీకి 175 స్పిల్‌వే గేట్లు ఉన్నాయి. ఇవి తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. గేట్లకు అనుసంధానంగా ఐరన్ రోప్, బేరింగ్‌ల వ్యవస్థ ఉంది. వీటిని పునరుద్ధరిస్తే గేట్లు తీయడం.. మూయడం సులువై.. లీకేజీలు అరికట్టే వీలుంది. గేట్ల నిర్వహణకు వీలుగా విద్యుత్తు ఆపరేషన్ సిస్టమ్ పునరుద్ధరించాలి. సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం, జనరేటర్లు అందుబాటులోకి తేవాలి. ఎక్స్‌స్ట్రాన్షన్ జాయింట్లు పనితీరు సమీక్షించాలి. వరద తగ్గిన తర్వాత బురద పోయేలా చూసే మూడు స్కవర్ స్లూయిస్‌లు పటిష్టపరచాలి.~~మూడు డెల్టాలకు మూడు హెడ్ స్లూయిస్‌ల తలుపుల మరమ్మతులు చేయాలి.

6 కిలో మీటర్లు బ్యారేజీ సుందరీకరణ కింద ధవళేశ్వరం-విజ్జేశ్వరం రోడ్డు పునరుద్ధరించాలి. తక్షణం నిధులు విడుదల చేస్తే ఈ పనులు అన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావాల్సి ఉందని, వస్తే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా ఆధ్వర్యంలోని డ్యామ్ సేఫ్టీ కమిటీ రెండు రోజులు బ్యారేజీని సందర్శించింది. కమిటీ ఈ మేరకు ఓ నివేదిక సిద్ధం చేస్తుంది. త్వరలో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ సందర్శనతో.. ఇప్పటికైనా కాటన్ బ్యారేజీ మరమ్మతులకు నోచుకుంటుందనే భరోసా దక్కుతుందనేది అందరి ఆకాంక్ష.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి