యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి…