తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం…