యూపీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నేతల ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. యూపీ సీఎం యోగి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గోరఖ్‌పుర్ శాసనసభస్థానం నుంచి యోగి తన నామినేషన్ దాఖలుచేశారు. ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు.…