జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్‌లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని…