కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది. కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార…