కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే…