ఇండియాలో సూపర్ హీరో సినిమాలతో తమని తాము నిరూపించుకోవడానికి పలువురు ప్రయత్నించారు. వారిలో రాకేశ్ రోషన్ తన క్రిష్ సీరీస్ ద్వారా సక్సెస్ అయ్యాడు. అయితే మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు ఏవీ ‘స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మాన్’ లా ప్రేక్షకులను ఉత్తేజపరచలేదు. అయితే తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలై అందరినీ ఆశ్చర్యపరుస్తూ చార్ట్‌లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. నిజానికి సూపర్‌హీరో చిత్రాలలో రెండు…