కేవలం హోం వర్క్ చేయలేదనే ఒకేఒక్క కారణంతో టీచర్ వేసిన శిక్షకు ఆచిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో చోటుచేసుకున్న ఈఘటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు 7ఏండ్లు. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్ కోప్పడింది. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై…