ప్రజలకు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. సామాన్యుడి నుంచి పెద్ద ప్రొఫెషనల్స్ వరకు.. అందరూ ఇలాంటి మోసాల బారిన పడిన వారే.. ఎందుకంటే ప్రజలను బురిడీ కొట్టించేందుకు స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏదో పెద్ద కొరియర్ కంపెనీ నుంచి పార్సిల్ వచ్చిందని, దాంట్లో డ్రగ్స్ లాంటివి ఉన్నాయని భయపెడుతూ స్కామర్లు ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నారు.
జీరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ సోమవారం తన మామగారితో ఒక చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 70 ఏళ్ల వృద్ధుడు తనకు సంతృప్తిగా ఉండటమే నిజమైన స్వేచ్ఛకు ఏకైక మార్గం అనే పాఠాన్ని ఎలా నేర్పించాడో వివరించాడు.