Nithyananda seeks medical asylum in Sri Lanka: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సహాయాన్ని కోరాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిత్యానంద శ్రీలంక రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. నిత్యానంద ఆరోగ్యం క్షీణించడంతో.. చికిత్స కోసం శ్రీలంక సాయాన్ని అభ్యర్థిస్తూ రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశాడు. దీంతో పాటు తన ద్వీప దేశం శ్రీకైలాసలో వైద్యపరమైన మౌళిక సదుపాయాల కొరతను లేఖలో ప్రస్తావించాడు.