అమరావతి నగరాన్ని నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిని మరలా పునఃప్రారంభించటం మంచి శుభదాయకం అని, ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిదని, దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూసుకుంటాం అని కేంద్ర మంత్రి…