నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు.