నీలోఫర్ ఆస్పత్రి నవజాత శిశువులు, వివిధ ఇబ్బందులతో వున్న చిన్నారులకు భరోసా కల్పించే ప్రభుత్వాసుపత్రి. ఎంతో చరిత్ర వున్న ఈ ఆస్పత్రిలో అప్పుడప్పుడు వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి వివాదం రేపింది. ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చింది నర్స్. అయితే, ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారంటున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఈ…