Rakasa Glimpse: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్.. మొదటిసారి తను సోలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న చిత్రం ‘రాకాస’. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు.…