రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…