ఇటీవల సెలబ్రిటీ ఈవెంట్లలో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న లులూ మాల్‌లో జరిగిన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో నిధి అసహనానికి గురైంది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన సమంత, ఈవెంట్ పూర్తయ్యాక బయటకు…