: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందులో 27 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే, జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ జనసేన పార్టీ ఖాతాలోకి చేరింది. గత నెల 20వ తేదీన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో ఛైర్మన్ ఆదినారాయణపై కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది.