రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో అభిమానం వెల్లువెత్తింది. కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామపంచాయతీ లోని ఊరి నాయన పల్లి గ్రామంలో నందమూరి తారకరామారావు అభిమానులు ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా వారి గ్రామంలో కొత్తగా జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు బాబులకే బాబు …తారక్ బాబు కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు… అంటూ నినాదాలు చేశారు.…