ఎట్టకేలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజల్ట్ ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అన్ని జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జెడ్పీటీసీ ఛైర్మన్ల పేర్లను సైతం ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది. పదవుల పంపకం విషయంలో…