న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి ఛేదించింది.