ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది.