దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ 251 పరుగులు చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచేందుకు భారత్ 252 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ మొదట్లో న్యూజిలాండ్ జట్టు 270-280 స్కోరును సులభంగా సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాటర్స్‌కి సాధ్యం కాలేదు. 4 క్యాచ్‌లు వదిలివేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 251 పరుగులకే పరిమితం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.