నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు రెడీ అయ్యారు.
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు…
నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలకపాత్ర పోషిస్తాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తుంటారు. అయితే, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం. కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో తయారయ్యే ఈ బొకేలు దేశం నలుమూలకు సరఫరా అవుతున్నాయి. నూతన సంవత్సర పూల బొకేలు సిద్ధం అవుతున్నాయి.. కడియం నుంచి దేశం నలుమూలలకు సరఫరా అవుతున్నాయి.
మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడకల్లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 31) వైన్స్ షాపుల సమయ వేళలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు పోలీస్ కమిషనర్.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్..
కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. కొత్త ఏడాదికి జనాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. కొంతమందికి న్యూ ఇయర్‌లో ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలోని కొన్ని ఎంచుకున్న గమ్యస్థానాల గురించి మీకు తెలియజేస్తాము, ఇక్కడ మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వెళ్ళవచ్చు.