దేశంలో ప్రవేశిస్తున్న కొత్త వైరస్ లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడే కోలుకున్న తరుణంలో మరో కొత్త వైరస్ భయాందోళనలను సృష్టిస్తోంది.
పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు.
రష్యాలోని గబ్బిలాలలో మరో వైరస్ 'ఖోస్టా-2'ను పరిశోధకులు కనుగొన్నారు, ఇది మానవులకు సోకుతుందని చెప్పారు. టైమ్ మ్యాగజైన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మానవ జనాభాకు సమస్యలను కలిగించే వైరస్‌ను పరిశోధకులు రష్యన్ గబ్బిలాలలో కనుగొన్నారు.
కేరళలో కొత్త రకం వైరస్ అక్కడి ప్రజలను కంగారెత్తి్స్తోంది. కేరళలోని పలు జిల్లాల్లో ఇటీవల టమాటో ఫ్లూ అనే వైరస్ వెలుగుచూసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా చిన్నారులు డీ హైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా, చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చర్మంపై టమాటో ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొల్లం ప్రాంతంలో…