వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలను ఆయన కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా... లూజుగా ఉన్నాయా... సరిపోయాయా అంటూ అడిగి…