కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చేవాళ్ళు కాదు.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్లి కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.
New Ration Card: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరు హామీ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంది.
New Ration Applications: కొన్నాళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనలో 5 గ్యారంటీలయిన (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) కు
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని ఇవాళ (గురువారం ) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటి ఇచ్చారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (జులై 26) జయశంకర్ భూపాలపల్లిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం రూ.…