ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో… కనీస పింఛను పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి కార్మిక సంఘాలు.. ఈ నేపథ్యంలో కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నట్టుగా సమాచారం.. ఉద్యోగులకు మెరుగైన స్థిర పెన్షన్ అందించే విధంగా కొత్త ఫిక్సిడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావడానికి సిద్ధం అవుతోంది ఈపీఎఫ్‌వో.. దీని ప్రకారం.. ఫిక్సిడ్ పెన్షన్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉద్యోగికి ఇవ్వనున్నారు.. ఇక, ఈ పథాన్ని స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు..
Read Also: Rabia Sidhu: సిద్ధూ కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు… నాన్న గెలిస్తేనే మ్యారేజ్..!
సంబంధిత ఉద్యోగి నెలసరి జీతం, మిగిలిఉన్న సర్వీస్ ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించనుంది ఈపీఎఫ్‌వో.. ఉద్యోగుల పెన్షన్ స్కీం-1995 ఆప్షన్ కొరకు ఈపీఎఫ్‌వో అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతోంది.. ప్రస్తుతం కనీస పెన్షన్ నెలవారీ విరాళం పరిమితి రూ.1,250గా ఉన్న విషయం తెలిసిందే కాగా.. ఉద్యోగుల ఆసక్తి మేరకు అది పెంచుకునే వీలు ఉంటుంది..