ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..