మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్ తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’…
వివిధ పార్టీల్లో మెంబర్ షిప్‌లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్‌లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే…