బ్రిటన్‌ను ఎక్కువ కాలం ఏలిన రాణి ఎలిజబెత్-2 కన్నుమూయడంతో ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3కి సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో కింగ్ చార్లెస్-3ను బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ప్రకటించారు.