ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పలు పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొత్తంగా రాష్ట్రంలో రూ.4,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పలు పరిశ్రమలకు భూమి పూజ ఈ రోజు నిర్వహించనున్నారు..
పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పలు పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.