CM Revanth Reddy: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.