Baby Growing In Bowel: ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతింది. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు.
monkeypox-New England Journal of Medicine study: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు కేసులు నమోదు అయ్యాాయి. కేరళలో ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 15,400 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) రెండోసారి సమావేశం నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం మంకీపాక్స్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.