శ్రీలంకను సంక్షోభం కుదిపేస్తోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన కీలక ప్రకటన చేశారు. దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మనుగడకు పోరాటం చేస్తున్న ప్రజల్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. రాజకీయ నాయకులు ప్రజల…