Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.