దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి…