Record Level Car Pre-Bookings: ప్రస్తుతం కొత్త కారును సొంతం చేసుకోవాలంటే డబ్బులుంటే చాలదు. దానికి మించి ఓపిక కావాలి. క్యూలోని లక్షల మందిలో ఒకరిగా వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. కనీసం రెండు, మూడు నెలల నుంచి గరిష్టంగా ఐదారు నెలల దాక ఎదురుచూడక తప్పదు. కొత్త కార్ల కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రీ-బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.