ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ అద్భుతం చేసింది. ఆ కంపెనీ ఇటీవల మొదటిసారిగా ఒకే రోజులో ఇద్దరు వాలంటీర్ల మెదడుల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)ని అమర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరు రోగులు కోలుకుంటున్నారు, వారికి కంపెనీ P8, P9 అని పేరు పెట్టింది. ఆ కంపెనీ X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది. వారు ఒకే రోజులో P8, P9లకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలిపింది. న్యూరాలింక్ సహాయంతో, పక్షవాతం ఉన్నవారు ప్రయోజనం పొందుతారని, వారు…