ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే సపరేటు అన్నట్లు ఉంటారు. ప్రపంచాన్ని గడగడలాడించే నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. చిన్న దేశం అయినా క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధాలతో అగ్రరాజ్యం అమెరికాను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కిమ్ తగ్గేదేలే అంటూ క్షిపణి పరీక్షతో కాదు…అణ్వాయుధ ప్రత్యేక చట్టంతో అగ్రరాజ్యానికి కోపం తెప్పిస్తున్నాడు. అమెరికాను మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు. అసలు విషయానికి వస్తే అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో…