తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన ఓ జంట.. అదును చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఓనర్లు లేని సమయం చూసి.. నగదు, నగలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కి చెందిన చక్రధర్, సీత అనే జంట 8 నెలల క్రితం వి. దామోదర్‌రావు ఇంట్లో పనిమనుషులుగా చేరారు. మూడేళ్ల కుమారుడు కూడా కలిగిన ఈ దంపతులు.. ఆ ఇంటి ప్రాంగణంలోనే…