Nepal Gen Z protests: నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని ఖాట్మాండుతో పాటు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు అంటుకున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సోమవారం 19 మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత, హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు ఇళ్లతో పాటు సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలకు నిప్పుపెట్టారు.
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు.