Nepal Floods 2025: నేపాల్‌లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు కారణంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకు తూర్పు నేపాల్‌లో సుమారుగా 42 మంది మరణించగా, ఐదుగురు గల్లంతయ్యారని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాం జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయని, ఈ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 37 మంది సమాధి అయ్యారని వెల్లడించాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాలను నిలిపివేశారు.…