Nepal Plane Crash : నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల ప్యాసింజర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులోని 68 ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది మృతి చెందారు.
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది.