బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీటీఎం లేఅవుట్‌లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తనను వేధించారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆరోపించింది. పని పూర్తి చేసుకునిఇంటికి తిరిగి వస్తుంది నేహా బిస్వాల్ అనే యువతి. అకస్మాత్తుగా ఓ బాలుడు సైకిల్‌పై ఆమె వద్దకు వచ్చి రొమ్ముపై టచ్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నేహా ఒక వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తోంది.